RGV: జూనియ‌ర్ ఎన్టీఆర్ చిలిపిచేష్ట‌ల‌పై ఆర్జీవీ కామెంట్.. వీడియో వైర‌ల్

  • ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్న జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అక్కినేని అఖిల్
  • అఖిల్ తొడ‌గిల్లే ప్ర‌య‌త్నం చేసిన ఎన్టీఆర్
  • ‘ఇక హీరోయిన్ల భవిష్యత్తు చాలా బాధాక‌రం’ అంటూ వ‌ర్మ కామెంట్
varma shares interesting video

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో యంగ్ హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్‌, అక్కినేని అఖిల్  ప‌క్క‌ప‌క్క‌నే కూర్చున్నారు. ఇందులో ఎన్టీఆర్,‌ అఖిల్‌లు స‌ర‌దాగా మాట్లాడుకుంటున్న‌ట్లు ఉంది. అయితే, ఆ స‌మ‌యంలో అఖిల్‌ తొడపై చేయి వేసి జూనియ‌ర్ ఎన్టీఆర్ గిల్లే ప్ర‌య‌త్నం చేశాడు.

దీంతో అఖిల్ అలా చేయొద్ద‌న్నట్లు ఎన్టీఆర్ చేతిని త‌న తొడ‌పై నుంచి తీసేశాడు. ఎన్టీఆర్ అంత‌టితో ఊరుకోకుండా మ‌రోసారి అఖిల్ తొడపై చేతిని వేసే ప్ర‌య‌త్నం చేయగా, అఖిల్ నవ్వుతూ సిగ్గుపడుతూ క‌న‌పడ్డాడు. ఈ వీడియోను రామ్ గోపాల్ వ‌ర్మ పోస్ట్ చేసి, ‘ఇక హీరోయిన్ల భవిష్యత్తు చాలా బాధాక‌రం’ అంటూ కామెంట్ చేశారు.

గతంలోనూ ప‌లువురు హీరోల‌పై రామ్ గోపాల్ వ‌ర్మ ఇటువంటి ఫొటోలు, వీడియోల‌ను పోస్ట్ చేసి వారికి చుర‌క‌లంటించారు. కాగా, ప్ర‌స్తుతం ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో న‌టిస్తుండ‌గా, అఖిల్ న‌టించిన‌ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అంతేగాక‌, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న 'ఏజెంట్' సినిమాలోనూ న‌టిస్తున్నాడు.

More Telugu News