Narendra Modi: కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న ప్రధాని నరేంద్రమోదీ

  • ఢిల్లీలోని ఎయిమ్స్‌లో టీకా రెండో డోసు
  • తొలి వ్యాక్సిన్ తీసుకున్న 37 రోజుల తర్వాత రెండో డోసు
  • అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలన్న ప్రధాని
PM Gets Second Vaccine Dose

గత నెల ఒకటో తేదీన కరోనా టీకా తొలి డోసు తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీ 37 రోజుల తర్వాత ఈ ఉదయం రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్న ఆయనకు భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా రెండో డోసు ఇచ్చారు. ప్రధాన నర్సు పి. నివేదా మోదీ చేయిని పట్టుకోగా, మరో నర్సు నిషా శర్మ వ్యాక్సిన్ వేశారు. తొలి డోసు వేయించుకున్నప్పటిలా కాకుండా మోదీ ఈసారి మాస్కుతో కనిపించారు. వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

‘‘ఎయిమ్స్‌లో ఈ ఉదయం కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నాను. వైరస్‌ను ఓడించేందుకు ఉన్న మార్గాల్లో వ్యాక్సినేషన్ ఒకటి. టీకా వేయించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరు వెంటనే టీకా తీసుకోండి. కొవిన్ యాప్ ద్వారా టీకా కోసం రిజిస్టర్ చేసుకోండి’’ అని ఆ ట్వీట్‌లో మోదీ కోరారు.

More Telugu News