TDP: హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకు వెళతాం: వర్ల రామయ్య

  • ఏపీలో పరిషత్ ఎన్నికలకు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్
  • రేపు యథాతథంగా ఎన్నికలు
  • న్యాయసలహా అనంతరం సుప్రీంకు వెళ్లాలని టీడీపీ నిర్ణయం
  • డివిజన్ బెంచ్ తీర్పు పట్ల సంతృప్తికరంగా లేమన్న వర్ల
  • చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారని వెల్లడి
TDP decides to go Supreme Court on AP High Court Division Bench verdict

ఏపీలో పరిషత్ ఎన్నికలు యథావిధిగా ఏప్రిల్ 8న జరుపుకోవచ్చంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. న్యాయసలహా అనంతరం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది.

ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయంపై స్పందించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు పట్ల సంతృప్తికరంగా లేమని రామయ్య అన్నారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వెళుతుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. 4 వారాల వ్యవధి నిబంధన ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు వెళతామని వెల్లడించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారని, పార్టీ ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించారని వివరించారు.

More Telugu News