CPI Ramakrishna: ఇప్పుడు ఆ లడ్డూలే ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు తియ్య‌గా ఉన్నాయా?: సీపీఐ రామ‌కృష్ణ‌

  • రాష్ట్ర ప్రజలను బీజేపీ దగా చేసింది
  • తిరుప‌తి ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి?
  • మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చార‌ని అప్ప‌ట్లో  పవన్  అన్నారు క‌దా
rama krishna slams bjp pawan

తిరుప‌తి ఉప ఎన్నిక‌ నేప‌థ్యంలో బీజేపీపై సీపీఐ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్యదర్శి రామకృష్ణ విమర్శల జ‌ల్లు కురిపించారు. ఈ రోజు ఆయ‌న తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ...  రాష్ట్ర ప్రజలను బీజేపీ దగా చేసిందని ఆయ‌న మండిప‌డ్డారు.

విభజన హామీలను బీజేపీ నేరవేర్చ‌లేద‌ని, అటువంటి బీజేపీకి ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎందుకు ఓటు వేయాలని ఆయ‌న నిల‌దీశారు. ఏపీకి ప్ర‌ధాని మోదీ  పాచిపోయిన లడ్డూలు ఇచ్చార‌ని అప్ప‌ట్లో పవన్ కల్యాణ్ విమ‌ర్శ‌లు గుప్పించార‌ని, ఇప్పుడు ఆ లడ్డూలే ఆయ‌న‌కు తియ్య‌గా ఉన్నాయా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఏడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ కు  ఏ అంశంలోనూ న్యాయం జరగలేదని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో వంద కోట్ల అవినీతి డబ్బుతో ఓట్లు కొని గెలవాలని వైసీపీ  ప్రయత్నం చేస్తోంద‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కూడా బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో ప్ర‌భుత్వ‌ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ తద్వారా వ్యవస్థలను కేంద్ర ప్ర‌భుత్వం  నిర్వీర్యం చేస్తోందని అన్నారు. దేశంలోని విమానాశ్ర‌యాలు, ఓడ రేవులను అదానీకి కట్టబెట్టాల‌ని మోదీ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నార‌ని ఆయ‌న విమర్శించారు.

More Telugu News