chicken: అమాంతం పెరిగిపోతోన్న చికెన్ ధ‌ర‌!

  • డిమాండ్‌కు తగ్గ స‌రఫ‌రా లేని వైనం
  • కోళ్ల దాణా ధరలు, రవాణా ఛార్జీల పెంపు
  • వారం క్రితం రూ. 210గా ఉన్న కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌
  • ఇప్పుడు రూ. 260.. మ‌రింత పెరిగే ఛాన్స్‌
hike in chicken rate

చికెన్ ధ‌ర‌లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కోడి మాంసం కొనుక్కోవాలంటే సామాన్యుడు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించాల్సి వ‌స్తోంది. ప్ర‌స్తుతం మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ స‌రఫ‌రా లేదు. దానికి తోడు కోళ్ల దాణా ధరలు, రవాణా ఛార్జీలు పెరిగాయి. వారం క్రితం రూ.210గా ఉన్న కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర ఇప్పుడు రూ.260కి పెరిగింది.  

ప‌లు ప్రాంతాల్లో అంత‌కు మించి ఉంది. లైవ్ కోడి ధ‌ర‌ సైతం రూ.160కి చేరింది. ఈ ఎండాకాలం కోడి మాంసం ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కోళ్లు ఎండలకు తట్టుకోలేక‌పోవ‌డంతో పాటు కోళ్ల‌ఫారాల్లో వాటి నిర్వహణ మ‌రింత ఖ‌ర్చుతో కూడుకున్న‌దిగా ఉంటుంది.

ప్ర‌స్తుతం కోళ్లకు తెగుళ్లు ఎక్కువయ్యాయి. వ‌చ్చే నెలలో శుభకార్యాల కోసం కోళ్ల‌కు మ‌రింత డిమాండ్ పెర‌గ‌నుంది. ఈ కార‌ణాల‌తో ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు, గుడ్ల ధ‌ర మాత్రం స్థిరంగా కొన‌సాగుతోంది. వారం రోజుల క్రితం డజను గుడ్ల ధర రూ.60గా ఉండ‌గా, ఇప్పుడు కూడా ఆ ధ‌ర‌లో మార్పులేదు.

More Telugu News