Karti P Chidambaram: కమల్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం వ్యంగ్యాస్త్రాలు

  • ‘లోకనాయకుడి’కి ప్రజానాయకుడిగా గుర్తింపు లేదు
  • ఎంఎన్ఎం సూపర్ నోటాగా మిగిలిపోతుంది
  • మోదీ, బీజేపీ నేతల పర్యటనల వల్ల ప్రయోజనం సున్నా
Karti P Chidambaram Satires on Kamal Haasan

మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్‌కు ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం జోస్యం చెప్పారు. ఆయన పార్టీ భవిష్యత్తులో ఉంటుందో, లేదో కూడా చెప్పలేమన్నారు.

లోకనాయకుడుగా పేరు తెచ్చుకున్న కమల్‌కు ప్రజానాయకుడిగా గౌరవం అంతంత మాత్రమేనని పేర్కొన్నారు. ఆయన పార్టీ ఓ ‘సూపర్ నోటా’గా మిగిలిపోతుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 200కుపైగా స్థానాల్లో గెలుపు తథ్యమని కార్తి ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీపైనా కార్తి విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. మోదీ సహా బీజేపీ నేతల పర్యటనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, వాళ్ల ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య సున్నాగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు.

More Telugu News