randde: నితిన్ కొత్త సినిమా 'రంగ్ దే' తొలి రోజు క‌లెక్ష‌న్ల వివ‌రాలు‌

  • నిన్న విడుద‌ల‌
  • తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌లిపి రూ.4.65 కోట్ల షేర్
  • నైజాంలో 1.54 కోట్లు
  • సీడెడ్  లో రూ.0.60 కోట్ల షేర్  
RangDe collected a share of 4 Cr in AP and TS on day 1

హీరో నితిన్ న‌టించిన కొత్త సినిమా  'రంగ్ దే' నిన్న విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఆయ‌న స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి రూపొందించారు. ఇందులో నరేశ్‌, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కీలక పాత్ర‌ల్లో న‌టించారు.

తొలిరోజు ఈ సినిమా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌లిపి రూ.4.65 కోట్ల షేర్‌ రాబ‌ట్టింది. నైజాంలో 1.54 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో రూ.0.52 కోట్లు, 0.31 కోట్లు రాబ‌ట్టింది. ఇక కృష్ణా జిల్లాలో రూ.0.21 కోట్లు,  నెల్లూరులో రూ.0.24 కోట్లు, విశాఖ‌లో రూ.0.56 కోట్లు, గుంటూరులో రూ.0.67 కోట్లు రాబ‌ట్టింది. సీడెడ్ (రాయలసీమ)లో రూ.0.60 కోట్ల షేర్ వ‌చ్చింది.

More Telugu News