Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • విజయ్ సినిమాలో రష్మిక కూడా?
  • 'కోటికొక్కడు'గా వస్తున్న సుదీప్
  • 'ఎఫ్ 3'లో మరో కథానాయిక    
Rashmika to be part of Vijays film

*  విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందే తమిళ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. అయితే, ఇందులో మరో కథానాయిక పాత్ర కూడా ఉండడంతో ప్రస్తుతం ఆ పాత్రకు రష్మికను ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ రష్మిక ఎంపిక ఓకే అయితే కనుక ఇద్దరు బిజీ స్టార్ హీరోయిన్లను ఒకే సినిమాలో చూడచ్చన్న మాట!
*  కన్నడ నటుడు కిచ్చ సుదీప్ నటించిన 'కోటిగొబ్బ 3' కన్నడ చిత్రాన్ని 'కోటికొక్కడు' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. శివకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మడోనా సెబాస్టియన్ కథానాయికగా నటించింది. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 3' సినిమాలో మూడో కథానాయిక కూడా ఉందట. ఈ పాత్రకు తాజాగా సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.

More Telugu News