Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • తమిళ సినిమాలో పూజ హెగ్డే ఖరారు 
  • వెరైటీ టైటిల్ తో వస్తున్న రాజ్ తరుణ్
  • 'జెర్సీ' నిర్మాతల మరో స్పోర్ట్స్ డ్రామా  
  • తమిళ హీరో డైరెక్టు తెలుగు సినిమా  
Pooja Hegde confirmed for Tamil movie

*  ఎనిమిదేళ్ల క్రితం తన కెరీర్ని 'ముగమూడి' అనే తమిళ సినిమాతో మొదలెట్టిన నేటి బిజీ స్టార్ పూజ హెగ్డే తాజాగా మరో తమిళ సినిమాలో నటిస్తోంది. విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో కథానాయికగా కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.
*  యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం పేరు 'స్టాండప్ రాహుల్'. నూతన దర్శకుడు మోహన్ వీరంకి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇందులో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తోంది.
*  ఆమధ్య నాని హీరోగా 'జెర్సీ' చిత్రాన్ని నిర్మించి జాతీయ అవార్డు అందుకున్న సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఇప్పుడు మరో స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని నిర్మించనున్నారు. 'జెర్సీ'ని క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించగా, ఇప్పుడీ చిత్రాన్ని బాస్కెట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కిస్తారు. రవికాంత్ పేరెపు దీనికి దర్శకత్వం వహిస్తాడు.
*  ఇప్పటికే కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్ త్వరలో డైరెక్టు తెలుగు సినిమా చేయనున్నాడు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తారు.

More Telugu News