Mohan Babu: నా మనస్సు చలించిపోయింది: మోహన్ బాబు

  • దర్శకుడు రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్ రావు కన్నుమూత
  • కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న కృష్ణమోహన్
  • ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మోహన్ బాబు
Mohan Babu pays condeolences to Raghavendra Rao brother

ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కృష్ణమోహన్ రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. 'నా సోదరుడు, దర్శకుడు రాఘవేంద్రరావు గారి అన్నగారు కృష్ణమోహన్ గారి మరణవార్త విని నా మనస్సు చలించిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను' అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.

More Telugu News