Hit-2: అడివి శేష్ హీరోగా ఘనంగా ప్రారంభమైన 'హిట్-2'

  • 'హిట్' చిత్రానికి సీక్వెల్ తీస్తున్న నాని
  • గతంలో వచ్చిన 'హిట్' విజయవంతం
  • హైదరాబాదులో నేడు ముహూర్తం షాట్
  • హీరో అడివి శేష్ పై క్లాప్ కొట్టిన నాని
Hit sequel starts in Hyderabad

గతంలో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన 'హిట్' చిత్రం పేరుకు తగ్గట్టే హిట్టయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో విష్వక్ సేన్ హీరోగా నటించగా శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. అయితే ఈసారి అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు.

 ఇవాళ హైదరాబాదులో 'హిట్-2... ది సెకండ్ కేస్' చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత నాని స్క్రిప్టును చిత్ర దర్శకుడికి అందించాడు. అడివి శేష్ పై ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. 'హిట్-2' చిత్రంలో మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్ హీరోయిన్లు. జాన్ స్టివార్ట్ సంగీతం అందిస్తున్నాడు.

More Telugu News