Chinta Mohan: తుళ్లూరు శాపగ్రస్త ప్రాంతం... అక్కడ అడుగుపెడితే అంతేసంగతులని చంద్రబాబుకు ముందే చెప్పా: మాజీ ఎంపీ చింతా మోహన్

  • చింతా మోహన్ మీడియా సమావేశం
  • తుళ్లూరు వెళ్లొద్దని చంద్రబాబుకు చెప్పానని వెల్లడి
  • వినకుండా వెళ్లి పదవి పోగొట్టుకున్నారని వ్యాఖ్యలు
  • చంద్రబాబు పనైపోయిందని విమర్శలు
Chinta Mohan comments on Chandrababu over Tulluru

తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రాజధాని అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా పేర్కొన్నారని, తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా తాను లేఖ రాశానని వెల్లడించారు. తుళ్లూరు ఓ శాపగ్రస్త ప్రాంతం అని, అక్కడ అడుగుపెడితే అంతేసంగతులని చంద్రబాబుకు ముందే చెప్పానని తెలిపారు.

రాజధానిగా తుళ్లూరు సఫలం కాదని చంద్రబాబుకు చెప్పినా వినిపించుకోకుండా ఆయన ముందుకెళ్లారని, పదవి కోల్పోయారని చింతా మోహన్ వివరించారు. తుళ్లూరు ఓ శపించబడిన ప్రాంతం అని అన్నారు. చంద్రబాబు పనైపోయిందని, టీడీపీ మునిగిపోతున్న నావ అని వ్యాఖ్యానించారు.

ఇక రాష్ట్ర విభజన, తెలంగాణ ఉద్యమం అంశాలను కూడా చింతా మోహన్ ప్రస్తావించారు. అసలు రాష్ట్ర విభజనకు కారకుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు. అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేందుకు వైఎస్సారే తెలంగాణ ఉద్యమానికి బీజం వేశారని, చెన్నారెడ్డి ద్వారా మొదలైన ఉద్యమం ఉస్మానియా వర్సిటీకి పాకిందని వివరించారు. ఆ తర్వాత కేసీఆర్ ఉద్యమానికి సారథ్యం వహించారని వెల్లడించారు.

More Telugu News