uppena: 'ఉప్పెన' సినిమా నుంచి సూప‌ర్ హిట్ పాట వీడియో విడుద‌ల‌

  • వైష్ణవ్‌ తేజ్ తొలి సినిమా ‘ఉప్పెన’
  • అల‌రించిన‌ శ్రీ‌మ‌ణి పాటలు
  • ‘జలజల జలపాతం నువ్వు’ వీడియో విడుద‌ల
uppena song releases

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా ‘ఉప్పెన’  ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్పనవ‌స‌రం లేదు. ఇందులోని పాట‌లు ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్ అయ్యాయి. శ్రీ‌మ‌ణి రాసిన ఈ సినిమా పాట‌లు కొన్ని నెల‌లుగా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాయి. ఈ సినిమాలో సముద్రం అందాల న‌డుమ ప‌డ‌వ‌లో హీరో, హీరోయిన్లు పాడుకునే పాట‌ ‘జలజల జలపాతం నువ్వు’ పూర్తి స్థాయి వీడియోను ఈ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది.  

ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి సముద్రం అందాల న‌డుమ‌ ప‌డ‌వ‌లో ఏకాంతంగా గ‌డిపిన సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఈ పాట ఉంటుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ పాట‌ను శ్రేయా ఘోషల్‌, జస్‌ప్రీత్ జాజ్ పాడారు. ఈ సినిమా మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమైంది.
 

More Telugu News