Nabha Natesh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • చైతు 'థ్యాంక్యూ'లో నభా నటేష్
  • 'వకీల్ సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్  
  • 'ఉప్పెన' హీరోతో 'జాతిరత్నాలు' డైరెక్టర్
Nabha Natesh opposite Naga Chaitanya

*  అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'థ్యాంక్యూ' చిత్రంలో ప్రధాన కథానాయికగా నభా నటేష్ ను తాజాగా ఎంపిక చేసినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.
*  పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వకీల్ సాబ్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 3న నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.
*  తాజాగా హిట్లు కొట్టిన ఓ హీరో.. మరో దర్శకుడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. 'ఉప్పెన' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్.. తాజాగా 'జాతిరత్నాలు' సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కేవీ కలసి ఓ చిత్రాన్ని చేయనున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

More Telugu News