Congress: పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామికి షాకిచ్చిన కాంగ్రెస్

  • 14 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
  • నారాయణస్వామికి దక్కని టికెట్
  • ఎన్నికల ప్రచారానికే పరిమితమవుతారన్న గూండూరావు
Puducherry Ex CM V Narayansamy name missing in candidates list

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వి.నారాయణస్వామిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. ఎన్నికల్లో నారాయణస్వామి పోటీ చేయడం లేదని పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దినేశ్ గూండూరావు ప్రకటించారు. ఎన్నికల ప్రచారం, ఎలక్షన్ మేనేజ్ మెంట్ కే ఆయన పరిమితమవుతారని చెప్పారు. 14 మంది పేర్లతో తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. వీరిలో సెల్వనదనె, ఎం కన్నన్, కార్తికేయన్ వంటి ప్రముఖులు ఉన్నారు. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది.

గత నెల 22న ముఖ్యమంత్రి పదవికి నారాయణస్వామి రాజీనామా చేశారు. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవడంలో ఆయన విఫలమవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరి 23న నారాయణస్వామి రాజీనామాను ఆమోదించడం జరిగింది.

More Telugu News