Amresh: రైస్ పుల్లింగ్ యంత్రం పేరుతో తమిళ సంగీత దర్శకుడి మోసాలు... అరెస్ట్ చేసిన పోలీసులు!

  • రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని నమ్మబలికిన అమ్రేష్
  • ఇరీడియంతో తయారైందని వెల్లడి
  • మార్కెట్లో కోట్ల ధర పలుకుతుందని వివరణ
  • ఓ వ్యక్తి నుంచి రూ.26 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణ
Police arrests Tamil music director

గత కొంతకాలంగా రైస్ పుల్లింగ్ యంత్రం పేరుతో అమాయకులను బుట్టలో వేసుకుని అందినకాడికి దండుకున్న సంఘటనలు చాలా జరిగాయి. రైస్ పుల్లింగ్ యంత్రం దగ్గరుంటే సకల సిరిసంపదలు వరిస్తాయని మోసగాళ్లు చెప్పే మాటలకు అనేకమంది బోల్తాపడుతుంటారు. అయితే, ఓ తమిళ సంగీత దర్శకుడు కూడా రైస్ పుల్లింగ్ యంత్రం పేరిట మోసాలకు పాల్పడడం వెలుగులోకి వచ్చింది.

అతడి పేరు అమ్రేష్. తన వద్ద ఎంతో అరుదైన ఇరీడియం లోహంతో చేసిన రైస్ పుల్లింగ్ యంత్రం ఉందని, దాని విలువ మార్కెట్లో కోట్ల ధర పలుకుతుందని నెడుమారన్ అనే వ్యక్తిని మోసగించినట్టు అమ్రేష్ పై ఆరోపణలు వచ్చాయి. అయితే అమ్రేష్ గ్యాంగ్ తనను నకిలీ ఇరీడియంతో మోసం చేసిందని, తన నుంచి రూ.26 కోట్లు తీసుకున్నారని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంగీత దర్శకుడు అమ్రేష్ ను అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. గతంలో రైస్ పుల్లింగ్ మోసాలు తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగాయి.

More Telugu News