Cameron Airpark: ప్రతి ఇంటికో విమానం, దానికో గ్యారేజి... కామెరాన్ ఎయిర్ పార్కు ప్రత్యేకత

  • అమెరికాలో ఎయిర్ పార్కు
  • కాలిఫోర్నియాలో 61 ఎకరాల్లో కొలువుదీరిన వైనం
  • గతంలో ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మించిన ప్రభుత్వం
  • తర్వాత కాలంలో ప్రాజెక్టు నిలిపివేత
  • ఇళ్లను కొనుక్కుని స్థిరపడిన ఔత్సాహికులు
 Cameron air park in USA

సొంత చిన్న విమానాలు కలిగి ఉన్న వారు తమకంటూ గేటెడ్ కమ్యూనిటీ నివాస ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడం పలుదేశాల్లో ఎప్పట్నించో ఉంది. ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీలనే ఎయిర్ పార్కులంటారు. అమెరికాలోని కామెరాన్ ఎయిర్ పార్కు కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇది కాలిఫోర్నియాలో ఉంది. విమానం నడపడం నేర్చుకున్న కొందరు ఔత్సాహికులు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు.

ఇక్కడ ప్రతి ఇంటికి ఓ చిన్న విమానం, ఆ విమానం పార్క్ చేయడానికి ఓ గ్యారేజి తప్పనిసరిగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా సొంత విమానంలోనే వెళ్లి వస్తుంటారు. అయితే ఇక్కడివారు ఇటీవల తమ ఇళ్లను అమ్మకానికి ఉంచారు. దాంతో ఈ కామెరాన్ ఎయిర్ పార్కు మరోసారి తెరపైకి వచ్చింది. ఇక్కడ రోడ్లన్నీ రన్ వేలను తలపించేలా విశాలంగా ఉంటాయి. విమానాలు పరస్పరం ఢీకొనకుండా ఉండేందుకు రోడ్లను మరింత వెడల్పుగా నిర్మించారు.

గతంలో ఇక్కడ 61 ఎకరాల్లో ఎయిర్ పోర్టు ఉండేది. ప్రజలకు అందుబాటులోకి తెచ్చే క్రమంలో అవాంతరాలు ఎదురవడంతో ప్రభుత్వం దీన్ని పక్కనపెట్టేసింది. దాంతో కొందరు పైలెట్లు, విమానం నడపడంపై ఆసక్తి ఉన్నవాళ్లు ఇక్కడ ఇళ్లను కొనుగోలు చేసి తమకంటూ ఓ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగానే కామెరాన్ ఎయిర్ పార్కు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ఎయిర్ పార్కులు ప్రపంచంలో 600కి పైగా ఉన్నాయని భావిస్తున్నారు.

More Telugu News