Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • నాగార్జున సరసన నాయికగా కాజల్
  • 'లూసిఫర్' కోసం ఔట్ డోర్ షూటింగ్
  • ఫ్యాన్సీ రేట్లతో 'లవ్ స్టోరీ' బిజినెస్    
Kajal plays wife to Nagarjuna

*  అందాలతార కాజల్ అగర్వాల్ తాజాగా నాగార్జున సరసన నటించనుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందే చిత్రంలో కాజల్ నాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని కాజల్ తెలుపుతూ.. ఈ చిత్రం షూటింగులో తాను ఈ నెల 31న జాయిన్ అవుతాయని చెప్పింది.
*  మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగును వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలి షెడ్యూలును తమిళనాడు లోని గ్రామీణ ప్రాంతంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట.
*  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రానికి బిజినెస్ పరంగా మంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. మొత్తానికి ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు సుమారు 30 కోట్లకు అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది.

More Telugu News