Virat Kohli: కోహ్లీ విజృంభణ... గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసిన టీమిండియా

  • అహ్మదాబాద్ లో మూడో టీ20
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • 46 బంతుల్లో 77 పరుగులు చేసిన కోహ్లీ
  • టీమిండియా స్కోరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 రన్స్
Team India posts respectable score after Kohli heroics

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగిస్తూ మరోమారు అర్ధసెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో కోహ్లీ 46 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంత్ (25), పాండ్య (17) ఫర్వాలేదనిపించగా.... మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.

తొలి రెండు మ్యాచ్ లలో ఆడని రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో బరిలో దిగినా 15 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. కేఎల్ రాహుల్ మరోమారు పేలవ ఫాం ప్రదర్శించి డకౌట్ కాగా, మొన్న మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ ఈసారి 4 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అయ్యర్ 9 పరుగులు చేశాడు. ఈ పోరులో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, ఆ జట్టు బౌలర్లు అందుకు తగ్గట్టే రాణించారు. మార్క్ ఉడ్ 3, క్రిస్ జోర్డాన్ 2 వికెట్లు తీశారు.

More Telugu News