Tulasi Reddy: రెండేళ్లయింది.. వివేకా కేసు ఏమైంది?: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

  • ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు
  • నిందితులను గుర్తించలేదు, చార్జిషీటూ లేదు
  • ఇలా చేస్తే వ్యవస్థలపై నమ్మకం పోతుంది
Tulasi Reddy questions over ys vivekananda reddy murder case

వైసీపీ నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిందని, ఇప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులను గుర్తించలేదని, చార్జిషీటు కూడా దాఖలు చేయలేదని అన్నారు.

ఇలా చేయడం వల్ల పోలీసు వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సిట్, సీబీఐలపై ప్రజలకు ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుందని తులసిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు అనుమానాలు తలెత్తుతున్నాయని తులసిరెడ్డి అన్నారు.

More Telugu News