Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • 'ఇదొక ఛాలెంజ్' అంటున్న సమంత 
  • 'వకీల్ సాబ్' నుంచి మూడో పాట 
  • 'దృశ్యం 2'లో జాయిన్ అవుతున్న మీనా 
Samanta about her role in Shakuntalam

*  ప్రస్తుతం తాను చేస్తున్న 'శాకుంతలం' సినిమా తన కేరీర్ మొత్తానికే ప్రతిష్ఠాత్మక చిత్రం అవుతుందని చెబుతోంది కథానాయిక సమంత. అలాగే, నటిగా తనకు ఎంతో ఛాలెంజ్ తో కూడిన పాత్ర ఇదని ఆమె చెప్పింది. ఈ చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో లాంఛనంగా మొదలైంది.
*  పవన్ కల్యాణ్ కథానాయకుడుగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న 'వకీల్ సాబ్' సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. మూడో పాటను రేపు (17న) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
*  ఇటీవల మలయాళంలో వచ్చిన 'దృశ్యం 2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. వెంకటేశ్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. కాగా, ఈ రోజు కథానాయిక మీనా ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతోంది.

More Telugu News