Chicago: అమెరికాలో జడలువిప్పిన తుపాకీ సంస్కృతి... షికాగోలో కాల్పుల మోత

  • ఓ పార్టీలో తుపాకీ కాల్పులు
  • రెండు వర్గాల మధ్య కాల్పులు
  • ఇద్దరి మృతి, 13 మందికి గాయాలు
  • ఏడుగురి పరిస్థితి విషమం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
Gun fire at a party in Chicago south side

అమెరికాలో తుపాకుల వినియోగం ఎంత అధికంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడి తుపాకీ సంస్కృతి అనేకమంది ప్రాణాలను బలిగొంది. తాజాగా షికాగో నగరంలో ఓ పార్టీలో తుపాకీ కాల్పులు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 13 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది.

సంఘటన స్థలం నుంచి షికాగో పోలీసులు నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది గ్యాంగ్ వార్ అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో షికాగో కూడా ఒకటి. ఇక్కడ 2020లో తుపాకీ కాల్పుల కారణంగా 760 మందికి పైగా మరణించారు.

More Telugu News