Chiranjeevi: చిరంజీవి చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన విశాఖ ఉక్కు కార్మికులు

  • విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • నెలరోజులుగా కార్మికుల పోరాటం
  • విశాఖ ఉక్కు ఉద్యమానికి చిరంజీవి మద్దతు
  • అందరూ సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి
  • చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు
Vizag Steel Plant workers thanked to Chiranjeevi

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మికులు గత నెల రోజులుగా పోరాడుతున్నారు. ఉక్కు పరిశ్రమ కార్మికుల నిరసనలకు మెగాస్టార్ చిరంజీవి కూడా సంఘీభావం తెలిపారు. దాంతో చిరంజీవికి కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చిరంజీవి, కేటీఆర్ తరహాలో ఇతర ప్రముఖులు కూడా తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కార్మికులు కోరారు.

అంతకుముందు చిరంజీవి స్పందిస్తూ... తాను యువకుడిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన ఉద్యమాన్ని చూశానని గుర్తుచేసుకున్నారు. నాటి ఉద్యమ నినాదాలు ఇంకా తన చెవుల్లో మార్మోగుతున్నాయని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ఉద్యమం జరుగుతోందని, ఉక్కు సంకల్పంతో ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

More Telugu News