Pawan Kalyan: తిరుపతి అభ్యర్థిపై నిర్ణయాన్ని జనసైనికులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్

  • పవన్ తో భేటీ అయిన సోము వీర్రాజు, దేవధర్
  • తిరుపతి ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై చర్చ
  • బీజేపీ అభ్యర్థిత్వంపై స్పష్టతనిచ్చిన పవన్
  • జనసేన శ్రేణులు దూరదృష్టితో ఆలోచించాలని సూచన
Pawan Kalyan comments on Tirupati loksabha candidate

తిరుపతి పార్లమెంటు స్థానంలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని తీర్మానించిన సంగతి తెలిసిందే. అయితే, ఏ పార్టీకి చెందిన నేత తిరుపతి బరిలో దిగుతాడన్న దానిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టతనిచ్చారు. ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కంటే తిరుపతి అభివృద్ధి ముఖ్యమని భావించామని వెల్లడించారు. 1999లో తిరుపతి పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరించారు.

"ఈ సందర్భంగా జనసేన శ్రేణులకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. జనసేన పార్టీ తరఫున మేం ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీతోపాటు పార్టీ జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలోపేతం కావడానికే అని గమనిస్తారని ఆశిస్తున్నా. తిరుపతి అభ్యర్థిపై నిర్ణయాన్ని జనసేన శ్రేణులు దూరదృష్టితో ఆలోచిస్తాయని భావిస్తున్నా" అంటూ సందేశం వెలువరించారు. ఇవాళ తిరుపతి అభ్యర్థి అంశంతో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ జనసేనాని పవన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

More Telugu News