Nawaz Sharif: నా కూతురికి ఏమైనా జరిగిందో... ప్రధాని ఇమ్రాన్, ముగ్గురు సైనిక జనరళ్లదే బాధ్యత: నవాజ్ షరీఫ్

  • పాక్ అధినాయకత్వంపై షరీఫ్ ఆగ్రహం
  • తన కుమార్తెను నాశనం చేస్తామని సైన్యం బెదిరించిందని వెల్లడి
  • తన కుమార్తె బస చేసిన హోటల్ గది తలుపు విరగ్గొట్టారన్న షరీఫ్
  • మరీ దిగజారిపోయారని విమర్శలు
Nawaz Sharif warns PM Imran and top three military generals

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దేశ అధినాయకత్వానికి, సైన్యానికి హెచ్చరికలు జారీ చేశారు. తన కుమార్తె మరియంకు ఏదైనా జరిగితే ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్, జనరల్ ఇర్ఫాన్ మాలిక్ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం తరచుగా సైన్యంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సైన్యం... మరియంను స్మాష్ (నాశనం) చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.

తన కుమార్తె పట్ల సైన్యం ప్రవర్తనను నవాజ్ షరీఫ్ తీవ్రంగా ఆక్షేపించారు. "మీరు మరీ దిగజారిపోయారు. మొదట, కరాచీలో నా కుమార్తె బస చేసిన హోటల్ రూం తలుపులు విరగ్గొట్టారు. ఇప్పుడు ఆమె మాట్లాడడం ఆపకపోతే అంతమొందిస్తామంటూ బెదిరిస్తున్నారు" అని పేర్కొన్నారు.

ఈ ముగ్గురు సైనిక జనరళ్లు 2018 ఎన్నికల్లో రిగ్గింగ్ కు కారకులయ్యారని, తద్వారా ప్రధాని గద్దెపై అసమర్థుడైన ఇమ్రాన్ ను కూర్చోబెట్టారని నవాజ్ షరీఫ్ విమర్శించారు. ఇటీవల సెనేట్ లో ప్రభుత్వానికి ఓటమి ఎదురయ్యాక ఇమ్రాన్ ఖాన్ ను గట్టెక్కించేందుకు ఆ ముగ్గురు సైనికాధికారులు చేసిన సాయం బహిరంగ రహస్యం అన్నారు.

More Telugu News