Narendra Modi: 'అమృత్ మహోత్సవ్' కార్యక్రమం ప్రారంభించిన ప్రధాని మోదీ

  • 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న స్వతంత్ర భారతం
  • దేశవ్యాప్తంగా 75 వారాల పాటు వేడుకలు
  • మహాత్ముడికి పుష్పాంజలి ఘటించిన మోదీ
  • మహాత్ముడి నివాసం హృదయ్ కుంజ్ సందర్శన
PM Modi inaugurates Amrit Mahotsav at Sabarmati Ashram

భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తికావొస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యాచరణకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మోదీ నేడు గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమంలో అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు వేడుకలు నిర్వహిస్తారు.

సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీకి పుష్పాంజలి ఘటించిన అనంతరం ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తెరలేపారు. ఇక్కడి పర్యాటకుల రిజిస్టర్ లో సంతకం చేసిన మోదీ తన సందేశం అందించారు. కాగా, గాంధీ తన అర్ధాంగి కస్తూర్బాతో కలిసి 1918 నుంచి 1930 వరకు నివసించిన హృదయ్ కుంజ్ నివాసాన్ని కూడా మోదీ సందర్శించారు.

More Telugu News