TV9 Ravi Prakash: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు సుప్రీంలో ఊరట
  • రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఈడీ 
  • హైకోర్టు అన్నీ పరిశీలించే బెయిల్ ఇచ్చిందన్న సుప్రీం
Supreme Court dismiss ED petition on Ravi Prakash bail cancellation

టీవీ9 చానల్ మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కు చెందిన నిధులను అనుమతుల్లేకుండా విత్ డ్రా చేయడం, ఫోర్జరీ వంటి అభియోగాలపై విచారణ ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రవిప్రకాశ్ కు గతంలో తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడా బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని స్పష్టం చేసింది. ఒకవేళ రవిప్రకాశ్ ఏమైనా బెయిల్ నిబంధనలు అతిక్రమించారా? అని ఈడీని ప్రశ్నించింది. రవిప్రకాశ్ గతంలో టీవీ9 చానల్ కు సీఈఓగా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడంటూ నూతన యాజమాన్యం ఫిర్యాదు చేయడం తెలిసిందే. 2018-19 మధ్య కాలంలో సుమారు రూ.18 కోట్లు బ్యాంకు నుంచి విత్ డ్రా చేసినట్టు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది.

More Telugu News