K Kavitha: 10 ఏళ్ల క్రితం ఇదే రోజున మిలియ‌న్ మార్చ్‌లో పాల్గొన్న వీడియోను పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ క‌విత‌!

  • ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్యమంలో కీల‌క ఘ‌ట్టం మిలియ‌న్ మార్చ్‌
  • ఉద్యోగ సంఘాల నేత‌లు,  విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వ‌ర్యంలో మార్చ్‌
  • కీల‌క పాత్ర పోషించిన తెలంగాణ జేఏసీ
  • పాల్గొన్న‌ వారందరికీ సెల్యూట్ అంటూ క‌విత పోస్ట్
kavita shares 10 years back video

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం ఇదే రోజున మిలియ‌న్ మార్చ్ ను నిర్వ‌హించారు. హైద‌రాబాద్‌లోని ట్యాంక్ బండ్ వేదికగా నిర్వ‌హించిన ఈ మార్చ్‌లో ఉద్యోగ సంఘాల నేత‌లు,  విద్యార్థి, ప్రజా సంఘాలు, ప‌లు పార్టీల నేత‌లు పాల్గొన్నారు.

తెలంగాణ‌ ఉద్య‌మ చ‌రిత్ర‌లోనే ఈ మిలియ‌న్ మార్చ్ కీల‌క ఘ‌ట్టంగా మిగిలిపోయింది. ఎన్నో అవరోధాల నడుమ ఈ మార్చ్‌ను ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ జేఏసీ విజ‌య‌వంతం చేసింది.

ఇందులో తాను కూడా పాల్గొన్నాన‌ని చెబుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఓ వీడియో పోస్ట్ చేశారు. మిలియ‌న్ మార్చ్‌లో పాల్గొన్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, వారి స్ఫూర్తికి వంద‌నం చేస్తున్నానని చెప్పారు. ఇందులో అంద‌రూ క‌లిసిక‌ట్టుగా నిల‌బ‌డి చ‌రిత్ర సృష్టించామ‌ని పేర్కొన్నారు.

More Telugu News