Pawan Kalyan: 'శ‌శి' సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

  • ఆది హీరోగా సినిమా
  • శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వం 
  • ఈ నెల 19న  సినిమా విడుద‌ల  
Sashi trailer  launched by PawanKalyan

ఆది హీరోగా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘శ‌శి’ సినిమా ట్రైల‌ర్‌ను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు విడుద‌ల చేశారు. ఈ సినిమాలో సుర‌భి, రాశీసింగ్  హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్పీ వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మిస్తున్నారు.  

ఈ నెల 19న  ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలోని 'ఒకే ఒక లోకం' పాటకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ సినిమాకు  అరుణ్ చిలివేరు సంగీతం అందిస్తున్నారు.

'మ‌నం ఏదైనా సాధించాల‌నుకున్న‌ప్పుడు ముందు మ‌న బ‌ల‌హీన‌త‌ల‌ను గెల‌వాలి' అంటూ ఆది చెబుతోన్న డైలాగు అల‌రిస్తోంది. 'మ‌న‌ల్ని చూసి ఎవ‌డైనా భ‌య‌ప‌డాలి కానీ, ఎవ‌డినో చూసి మ‌నం భ‌య‌ప‌డ‌డం ఏంటీ' అంటూ హీరోయిన్ ఓ డైలాగు కొట్టింది.

   

More Telugu News