Satyavathi Rathod: తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్

  • మంత్రి సత్యవతి రాథోడ్ కి పాజిటివ్ అని నిర్ధారణ
  • యశోదా ఆసుపత్రిలో చేరిన మంత్రి
  • తనను కలసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరిన సత్యవతి  
Minister Satyavathi Rathod tests Corona positive

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య 3 లక్షలను దాటేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా గిరిజన అభివృద్ధి శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా సోకింది.

ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ ఉదయం కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆమె హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. కాసేపటి క్రితం హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో ఆమె చేరినట్టు తెలుస్తోంది. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

మరోవైపు తెలంగాణలో కొత్తగా 111 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 27 కేసులను నిర్ధారించారు. గత 24 గంటల్లో ఒకరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 1,642 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.

More Telugu News