Air France: ఓ ఇండియన్ చేసిన గోలతో బల్గేరియాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఎయిర్ ఫ్రాన్స్ విమానం!

  • పారిస్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానం
  • ఇండియన్ చేసిన గోలతో అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి
  • నేరం నిరూపితమైతే పదేళ్ల జైలుశిక్ష
Air France Flight Emergency Landing After Indian Chavos

పారిస్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో ఓ భారతీయుడు చేసిన గోల కారణంగా, దాన్ని బల్గేరియాలోని సోఫియా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బల్గేరియా అధికారుల కథనం ప్రకారం, పారిస్ నుంచి విమానం బయలుదేరిన తరువాత భారత పౌరుడు ఒకరు తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. వారించిన విమాన సిబ్బందిపై దాడి చేశాడు. కాక్ పీట్ వద్దకు వెళ్లి, తలుపులు బాదాడు. అతని ప్రవర్తన విమాన సురక్షిత నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా ఉండటంతో సోఫియాలో ల్యాండింగ్ కు అనుమతి కోరిన పైలట్, విమానం కిందకు దిగిన తరువాత, అతన్ని భద్రతా అధికారులకు అప్పగించారు.

పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశామని, నేరం నిరూపితమైతే 10 సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడుతుందని బల్గేరియా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారి ఇవాలియో ఆంజెలోవ్ వెల్లడించారు. అతన్ని దించేసిన తరువాత విమానం న్యూఢిల్లీకి తిరిగి ప్రయాణాన్ని కొనసాగించిందని పేర్కొన్నారు. ఈ విషయంలో జరిగిన ఘటనపై విచారిస్తున్నామని, ప్రాధమిక విచారణ మేరకు ఏ సహేతుక కారణం లేకుండానే అతనిలా ప్రవర్తించాడని తేలిందని ఆంజెలోవ్ తెలియజేశారు.

More Telugu News