Taapsee Pannu: ఐటీ సోదాలపై మూడు రోజుల తర్వాత నోరు విప్పిన తాప్సీ

  • మూడ్రోజుల సోదాలు.. 3 విషయాలంటూ ట్వీట్
  • లేని బంగళా తాళాల కోసం వెతికారని ఆరోపణ
  • ఆర్థిక మంత్రి కామెంట్లపైనా స్పందన
  • 2013 దాడులు తనకు గుర్తులేవని ఎద్దేవా
  • దాడులతో వారికి ఒరిగిందేమీ లేదని కామెంట్
Taapsee counters IT Raids after 3 days

ఐటీ సోదాలపై బాలీవుడ్ నటి తాప్సీ స్పందించింది. మూడు రోజుల తర్వాత ఆ సోదాలపై నోరు విప్పింది. వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మూడు రోజుల సోదాలు.. మూడు విషయాలు అంటూ ట్వీట్ చేసింది.

‘‘1. పారిస్ లో నేను కొనుగోలు చేశానని చెబుతున్న బంగళా తాళాల కోసం వెతికారు. 2. నేను ఇంతకు ముందు తీసుకోని రూ.5 కోట్లకు సంబంధించిన రశీదుల గురించి సోదాలు చేశారు. 3. ఆర్థిక మంత్రి చెబుతున్నట్టు 2013లో నా ఇంటిపై సోదాలు జరిగిన విషయం నాకే గుర్తు లేదు’’ అని తాప్సీ ట్వీట్ చేసింది. ఈ సోదాలతో వారికి ఒరిగిందేమీ లేదని పేర్కొంది.

కాగా, తాప్సీతో పాటు దర్శకుడు అనురాగ్ కశ్యప్, మధు మంతెన ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఫాంటమ్ ఫిలిమ్స్ పన్ను ఎగవేతలకు సంబంధించి అధికారులు ఈ సోదాలు చేశారు. దీనిపై దుమారం రేగడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు. 2013లో కూడా వారిపై ఐటీ దాడులు జరిగాయని, అప్పుడు లేని రాద్ధాంతం ఇప్పుడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.

More Telugu News