Vijay Devarakonda: తన తమ్ముడి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

  • ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం పుష్పక విమానం
  • టైటిల్ ఖరారు చేసిన చిత్రబృందం
  • దామోదర అట్టాడ దర్శకత్వంలో చిత్రం
  • హీరోయిన్లుగా శాన్వీ మేఘన, గీతా సైనీ
Vijay Devarakonda releases first look poster of Pushpaka Vimanam

దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలతో పేరుతెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ ఈసారి కామెడీ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ను ఆనంద్ సోదరుడు, అగ్రహీరో విజయ్ దేవరకొండ ఇవాళ రిలీజ్ చేశాడు. దామోదర అట్టాడ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి పుష్పక విమానం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

కింగ్ ఆఫ్ ద హిల్, టాండా ప్రొడక్షన్స్ బ్యానర్లపై విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లి, గోవర్ధన్ రావ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పుష్పక విమానం చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన శాన్వీ మేఘన, గీతా సైనీ కథానాయికలు. సీనియర్ నటుడు సురేశ్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాకు రామ్ మిరియాల, అమిత్ దాసాని, సిద్ధార్థ్ సదాశివుని సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

More Telugu News