USA: అప్పుల ఊబిలో అమెరికా... ఇండియాకు భారీగా బాకీపడ్డ అగ్రదేశం!

  • 29 ట్రిలియన్లకు అప్పులు చేరుకున్నాయన్న అలెక్స్ మూనీ
  • భారత్ కు 216 బిలియన్ డాలర్లు బాకీపడ్డ వైనం
  • జపాన్, చైనాలకు ట్రిలియన్ డాలర్లకు పైగా చెల్లించాల్సిన అమెరికా
America to repay huge debts to india

మీరు చదువుతున్నది నిజమే. అగ్రరాజ్యం అమెరికాకు పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నాయి. భారత్ కు సైతం అమెరికా 216 బిలియన్ డాలర్లు రుణపడి ఉంది. మన కరెన్సీలో చెప్పుకుంటే సుమారు రూ. 15 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ  దిగువసభ సభ్యుడు అలెక్స్ మూనీ వెల్లడించారు. అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

2020 నాటికి అమెరికా అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పుడు ఆ మొత్తం 29 ట్రిలియన్లకు చేరుకుందని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడిపై 72,309 డాలర్ల అప్పుల భారం ఉందని చెప్పారు. భారత్ కు 216 బిలియన్ డాలర్లు బాకీ పండిందని తెలిపారు. జపాన్, చైనాలకు ట్రిలియన్ డాలర్లపైన బాకీ చెల్లించాల్సి ఉందని చెప్పారు.  

మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అలెక్స్ మూనీ మాట్లాడుతూ, ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే ముందు అప్పులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

More Telugu News