Vijayasai Reddy: చంద్రబాబు ఎర్రగడ్డలో చేరాల్సిన పరిస్థితి కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి

  • అసెంబ్లీ ఓడినప్పుడు కూడా గుడ్డలు చించుకుని మాట్లాడారు
  • వైసీపీని గెలిపించి ప్రజలు తప్పు చేశారని తేల్చారు
  • దమ్ముంటే గెలిచారంటున్న పంచాయతీలను ఎల్లో పేపర్లలోనైనా ప్రకటించండి
Chandrababu has to join in Erragadda says Vijayasai Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి 23 సీట్లకు పరిమితమైన తర్వాత చంద్రబాబు ఇలాగే గుడ్డలు చించుకుని మాట్లాడారని విమర్శించారు.

ఇప్పుడూ అదే ఏడుపు రిపీట్ అయిందని... ఎప్పటిలాగే అధికారులను, పోలీసులను ఆయన బెదిరించారని చెప్పారు.. వైఎస్సార్ కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు తప్పు చేసారని తేల్చారని అన్నారు. చంద్రబాబుకు మతి పూర్తిగా భ్రమించిందని... పోలీసు అధికారులను చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్న తీరు చూస్తుంటే తక్షణం ఎర్రగడ్డలో చేర్చాల్సిన పరిస్థితి కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'అందరి వివరాలు రాసుకున్నారంట. ఆధారాలు కూడా ఉన్నాయంట. జమిలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిన వెంటనే ఆయన సీఎం అయి తన పవరేంటో చూపిస్తారంట. 41 శాతం సర్పంచ్ పదవులు గెలిచామంటూ జబ్బలు చరుస్తున్నారు. హిందూపురం, అమరావతి, కుప్పంలోనే డిపాజిట్లు రాలేదు. మీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నచోట సింగిల్ డిజిట్ దాటలేదు. మీ కాకిలెక్కల్ని జనం నమ్ముతారా? దమ్ముంటే గెలిచారంటున్న పంచాయతీలను ఎల్లో పేపర్లలోనైనా ప్రకటించండి.  

వైజాగ్ స్టీల్ పై ప్రధానికి రాసిన లేఖతో, తను గోబెల్స్ ప్రచారాలకు పాల్పడ్డట్టు చంద్రబాబు అంగీకరించారు. జగన్ గారి ప్రభుత్వం ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తోందని మొన్నటి దాకా దుష్ప్రచారం చేసారు. కేంద్ర బడ్జెట్ లో ప్రైవేటీకరణను ప్రతిపాదించారని లేఖలో ప్రస్తావించారు' అని ట్వీట్ చేశారు.

More Telugu News