AP High Court: ఎస్ఈసీ పిటిషన్ నేపథ్యంలో తమ ఎదుట హాజరు కావాలంటూ నీలం సాహ్నీ, గోపాలకృష్ణ ద్వివేదిలకు హైకోర్టు ఆదేశాలు

  • గతంలో నీలం సాహ్నీ, గోపాలకృష్ణ ద్వివేదిలపై కోర్టు ధిక్కరణ పిటిషన్
  • తమకు సహకరించడంలేదన్న ఎస్ఈసీ
  • కోర్టును ఆశ్రయించిన వైనం
  • ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణ
  • వ్యక్తిగతంగా హాజరు కావాలన్న హైకోర్టు
High Court orders Neelam Sahni and Gopalakrishna Dwivedi for personal appearance

స్థానిక ఎన్నికల నేపథ్యంలో తమకు సహకరించడంలేదంటూ మాజీ సీఎస్ నీలం సాహ్నీ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో రెండు పర్యాయాలు విచారణ జరిగింది.

తాజా విచారణలో ఎస్ఈసీ వాదనల పట్ల కోర్టు స్పందిస్తూ, నీలం సాహ్నీ, గోపాలకృష్ణ ద్వివేది మార్చి 22న తమ ఎదుట హాజరుకావాలంటూ ఆదేశించింది. వీరిద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కి వాయిదావేసింది. గతంలో సీఎస్ గా వ్యవహరించిన నీలం సాహ్నీ పదవీ విరమణ అనంతరం ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.

More Telugu News