Surabhi Vanidevi: పీవీ నరసింహారావు కుమార్తెకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్

  • తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
  • హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ అభ్యర్థిగా సురభి వాణీదేవి
  • వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం కేసీఆర్
  • ఎల్లుండితో ముగియనున్న నామినేషన్ ప్రక్రియ
  • మార్చి 14న పోలింగ్
CM KCR gives MLC chance for Surabhi Vanidevi daughter of late PV Narasimharao

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. కాగా, దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతారు. ఆమె రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు. మార్చి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు.

More Telugu News