YS Sharmila: షర్మిల పార్టీకి సలహాదారులుగా ప్రభాకర్ రెడ్డి, ఉదయసిన్హా నియామకం

  • పార్టీ నిర్మాణంలో బిజీగా ఉన్న షర్మిల
  • షర్మిలకు మద్దతు పలికిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
  • పార్టీలో చేరనున్న మోటివేషనల్ స్పీకర్ షఫీ
Prabhakar Reddy and Uday Sinha appointed as Shamila party advisors

తన కొత్త పార్టీ నిర్మాణంలో వైయస్ షర్మిల బిజీగా ఉన్నారు. జిల్లాల వారీగా నేతలతో ఆమె సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆమెను కలిశారు. మరోవైపు పార్టీ సలహాదారులుగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయసిన్హాలను నియమించారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో సీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి పని చేయగా, సీఎస్ఓగా ఉదయసిన్హా పని చేశారు.

మరోవైపు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ కూడా షర్మిల పార్టీలో చేరనున్నారు. కాసేపట్లో షర్మిలతో ఆయన భేటీ కాబోతున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో ఆయన మోటివేట్ చేయనున్నట్టు సమాచారం. ఇంకోవైపు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య షర్మిలను కలిసి, ఆమెకు మద్దతు పలికారు.

తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. తెలంగాణలో ఆంధ్రవాళ్ల పార్టీలు ఎందుకని పలువురు నేతలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనం ఎందుకని అంటున్నారు. ఈ నేపథ్యంలో, తాను 'తెలంగాణ కోడలు' అని ప్రకటించేందుకు షర్మిల సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇంటి కోడలిగా తాను తెలంగాణకే చెందుతానని చెపుతూ ఆమె ప్రజల్లోకి వెళ్లనున్నట్టు సమాచారం.

More Telugu News