Jesnoor Dyara: ఓ బిడ్డకు తానే తల్లి, తండ్రి అవ్వాలని ట్రాన్స్ జెండర్ డాక్టర్ ఆరాటం!

  • గుజరాత్ లో పంచమహల్ లో జన్మించిన జెస్నూర్ డయారా
  • డయారాలో బాల్యం నుంచే స్త్రీ లక్షణాలు
  • పురుషుడిగా ఉన్నప్పుడే వీర్యాన్ని భద్రపరిచిన డయారా
  • త్వరలో స్త్రీగా మారేందుకు సర్జరీ
  • ఆపై తన వీర్యంతో తానే తల్లి అయ్యేందుకు ప్రణాళిక
Transgender doctor wants to be mother and father to a child

అహ్మదాబాద్ కు చెందిన జెస్నూర్ డయారా ఓ ట్రాన్స్ జెండర్. డయారా వృత్తి రీత్యా ఓ డాక్టర్. ఆమె వయసు పాతికేళ్లు. ఇప్పుడు డయారా గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే ఓ బిడ్డకు శాస్త్రీయంగా తల్లి, తండ్రి తానే అవ్వాలని పరితపిస్తోంది.

 అందుకోసం ఏం చేసిందో తెలుసుకునే ముందు ఆ ట్రాన్స్ జెండర్ వివరాల్లోకి వెళితే... గోద్రా ప్రాంతంలోని పంచమహల్ అనే కుగ్రామంలో జన్మించింది. అబ్బాయిగానే పుట్టినా, మానసికంగా తనను తాను స్త్రీగానే భావించిన జెస్నూర్ డయారా రష్యాలో వైద్య విద్య అభ్యసించింది. గుజరాత్ లో తొలి ట్రాన్స్ జెండర్ డాక్టర్ గా చరిత్ర సృష్టించింది.

అయితే, బాల్యం నుంచి అమ్మాయిల లక్షణాలు అధికంగా ఉన్న డయారా స్త్రీగా మారాలని బలంగా నిశ్చయించుకుంది. స్త్రీగా మారడమే కాదు, ఓ బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వపు మధురిమలు చవిచూడాలని తలపోసింది. అయితే, ఆ బిడ్డకు తానే తండ్రిని అవ్వాలని కూడా డయారా వినూత్నంగా ఆలోచించింది. అందుకే తాను పురుషుడిగా ఉన్నప్పుడే వీర్యాన్ని భద్రపరిచింది.

ఇక స్త్రీగా మారే క్రమంలో ఇప్పటికే పలు శస్త్రచికిత్సలు చేయించుకుంది. త్వరలో నిర్వహించే శస్త్రచికిత్సతో తాను పూర్తిగా స్త్రీగా మారిపోనుంది. ఆపై తన వీర్యంతోనే తాను తల్లి కావాలన్నది డాక్టర్ జెస్నూర్ డయారా ఆలోచన. ఆమె కల నిజమైతే ఓ బిడ్డకు తల్లి, తండ్రి తానే అయిన మొట్టమొదటి వ్యక్తిగా జెస్నూర్ డయారా పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

More Telugu News