Lok Sabha: లోక్ సభ వాయిదా.... మార్చి 8న రెండో విడత బడ్జెట్ సమావేశాలతో పునఃప్రారంభం

  • ముగిసిన లోక్ సభ బడ్జెట్ తొలి విడత సమావేశాలు
  • ప్రకటన చేసిన స్పీకర్ ఓం బిర్లా
  • ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు
  • నిన్ననే వాయిదా పడిన రాజ్యసభ
Lok Sabha budget session concluded

పార్లమెంటు బడ్జెట్ తొలి విడత సమావేశాలు నేటితో ముగిశాయి. బడ్జెట్ పై చర్చ కొనసాగింపుతో పాటు, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం, జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టడం, బిల్లుపై చర్చ, సభ్యుల ఆమోదం వంటి పరిణామాలు ఇవాళ లోక్ సభలో చోటుచేసుకున్నాయి. అనంతరం సభ వాయిదా వేశారు. మార్చి 8న జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాలతో లోక్ సభ తిరిగి ప్రారంభం కానుంది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8 వరకు జరగనున్నాయి. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓ ప్రకటనలో తెలిపారు.

అటు, రాజ్యసభ నిన్ననే వాయిదా పడింది. రాజ్యసభ తిరిగి మార్చి 8న పునఃప్రారంభమవుతుందని చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ కార్యకలాపాలు నిర్వహిస్తుండడం తెలిసిందే.

More Telugu News