Pawan Kalyan: ఈ ఫలితాలు చూస్తుంటే మార్పు మొదలైందని అర్థమవుతోంది: పవన్ కల్యాణ్

  • ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి
  • జనసేన మద్దతుదారులకు 18 శాతానికి పైగా ఓట్లు వచ్చాయన్న పవన్
  • పార్టీ శ్రేణులకు పవన్ అభినందనలు
  • మిగిలిన మూడు దశల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని పిలుపు
Pawan Kalyan analyses first phase Panchayat Elections

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జనసేన పార్టీ పరంగా చూస్తే ఎంతో సంతృప్తినిచ్చాయని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తొలి విడత ఎన్నికల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో ప్రభావశీలంగా పనిచేశారని అభినందించారు. జనసేన భావజాలంతో బరిలో దిగినవారు 18 శాతానికి పైగా ఓట్లు సంపాదించారని, గణనీయమైన స్థాయిలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు చేజిక్కించుకున్నారని పవన్ వెల్లడించారు. 1000కి పైగా వార్డుల్లో గెలిచారని, 1,700కి పైగా పంచాయతీల్లో జనసేన అభ్యర్థులకు రెండో స్థానం దక్కిందని విశ్లేషించారు.

మార్పు మొదలైందని చెప్పేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఇది కచ్చితంగా మార్పుకు సంకేతం అని స్పష్టం చేశారు. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అంటే అధికార పక్షానికే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, అటువంటి పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు ధైర్యంగా నిలిచి పోరాడారని కితాబిచ్చారు. వచ్చే మూడు దశల్లోనూ ఇదే స్ఫూర్తిని జనసేన శ్రేణులు కనబర్చాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

పవన్ ను విమర్శించే స్థాయి అంబటికి లేదు: జనసేన

జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. పవన్ ను విమర్శించే స్థాయి అంబటికి లేదని స్పష్టం చేసింది. అంబటి వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయని, సీఎం మెప్పుకోసమే మాట్లాడుతున్నట్టుందని విమర్శిస్తూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ నాయకుడిపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు హెచ్చరించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసి ఆ ఆలోచన విరమించుకోవాలని కోరారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ను ఓ పరిశ్రమగా చూడొద్దని, ఆంధ్రుల సెంటిమెంట్ గా భావించాలని అమిత్ షాకు వివరించారని, దానిని అభినందించాల్సింది పోయి, అంబటి రాంబాబు అసహనంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.ః

More Telugu News