RRR: క్లైమాక్స్ కు ముందు ప్రాక్టీసు... ఆర్ఆర్ఆర్ సెట్స్ పై రామ్ చరణ్, ఎన్టీఆర్ సన్నాహాలు

  • క్లైమాక్స్ షూట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ యూనిట్
  • ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెషన్స్ ఏర్పాటు
  • హాజరైన ఎన్టీఆర్, చరణ్
  • సోషల్ మీడియాలో ఫొటోలు
Practice session for RRR Climax shoot

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఓ పర్ఫెక్షనిస్టు అన్న సంగతి తెలిసిందే. నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడం నుంచి టెక్నీషియన్ల నుంచి మెరుగైన అవుట్ పుట్  వచ్చే వరకు ఆయన విశ్రమించరు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా అదే ఫార్ములా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి క్లైమాక్స్ షూట్ చేస్తుండగా, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కోసం ప్రాక్టీసు సెషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రాక్టీసు సెషన్ కు విచ్చేసిన ఎన్టీఆర్, చరణ్ ల ఫొటోలను ఆర్ఆర్ఆర్ చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యావత్ భారతదేశ చిత్రపరిశ్రమ వేచిచూస్తోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియో మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More Telugu News