Tirumala: ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళితే... శీఘ్రదర్శనం!

  • శుభవార్త చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ
  • రోజుకు 1000 మందికి దర్శనం
  • రెండు స్లాట్లలో టికెట్ల విక్రయం
  • రిజర్వేషన్ సమయంలోనే శీఘ్రదర్శనం టికెట్
Seeghra Darshan Ticket for APSRTC Travellers in Tirumala

తిరుమలకు వెళ్లే యాత్రికులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి రిజర్వేషన్ చేయించుకునే సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనానికి రూ. 300 శీఘ్రదర్శనం టికెట్ ను కూడా కొనుగోలు చేయవచ్చు. తిరుపతికి వెళ్లే దూరప్రాంత సర్వీసులకు ఈ సదుపాయం వర్తిస్తుందని, రూ. 300 అదనంగా చెల్లించి ఉదయం 11 గంటల స్లాట్ లో, ఆపై సాయంత్రం 4 గంటల స్లాట్ లో టికెట్లను ఎంచుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

ఈ స్కీములో రోజుకు 1000 టికెట్లను జారీ చేయనున్నామని తెలిపారు. ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్ లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

More Telugu News