APSRTC: టికెట్ రిజర్వేషన్ వెబ్ సైట్లో మార్పులు చేసిన ఏపీఎస్ఆర్టీసీ

  • రిజర్వేషన్ వెబ్ సైట్ కు కొత్త డొమైన్ నేమ్
  • ఇకపై రిజర్వేషన్లు కొత్త సైట్ లో చేసుకోవాలని ఆర్టీసీ సూచన
  • టికెట్ రద్దు, రిఫండ్ వివరాల కోసం సరికొత్త మెయిల్ ఐడీ
  • ఫిర్యాదుల కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్
APSRTC changes its ticket reservation website

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) తన టికెట్ రిజర్వేషన్ వెబ్ సైట్ లో మార్పులు చేసింది. వెబ్ సైట్ డొమైన్ నేమ్ ను మార్చింది. ఇప్పటివరకు www.apsrtconline.in వెబ్ సైట్ ద్వారా రిజర్వేషన్ సేవలు అందించిన ఆర్టీసీ ఇకపై www.apsrtconline.org.in ద్వారా సేవలు అందిస్తుంది. ఇక మీదట www.apsrtconline.org.in ద్వారానే రిజర్వేషన్లు చేసుకోవాలని ఆర్టీసీ వెల్లడించింది. టికెట్ రద్దు కోసం refunds.apsrtc@gmail.com మెయిల్ ఐడీకి వివరాలు పంపాలని తెలిపింది. ఫిర్యాదుల కోసం 0866 2570005 నెంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించింది.

More Telugu News