Rajasekhar: 'శేఖర్'గా వస్తున్న రాజ‌శేఖ‌ర్.. కొత్త సినిమా ఫ‌స్ట్‌లుక్‌ విడుదల!

  • కొత్త ద‌ర్శ‌కుడు లలిత్ కుమార్ తో సినిమా
  • క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో మూవీ 
  • తెల్లటి ‌గ‌డ్డంతో రాజ‌శేఖ‌ర్ లుక్
1st look of Rajasekhar  in  as Shekar

హీరో రాజ‌శేఖ‌ర్‌, కొత్త ద‌ర్శ‌కుడు లలిత్ కుమార్ కాంబినేష‌న్‌లో క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న‌ విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు 'శేఖ‌ర్' అనే పేరును ఖ‌రారు చేశారు. ఈ రోజు రాజశేఖర్ జన్మదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది.

ఇందులో రాజ‌శేఖ‌ర్ కొత్త త‌ర‌హా లుక్‌లో క‌న‌ప‌డుతూ అల‌రిస్తున్నారు. ఈ లుక్‌లో ఆయ‌న ముఖంలోని స‌గం భాగాన్నే చిత్ర యూనిట్ చూపించింది. ఈ నెల మూడో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా రాజశేఖర్ చెబుతూ, ఆమధ్య క‌రోనా కార‌ణంగా తాను తీవ్ర అనారోగ్యం పాలై ఆసుప‌త్రి‌లో చికిత్స తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో అండగా నిలిచిన అభిమానులకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్రేక్షక దేవుళ్ల వల్లే తాను పుట్టిన రోజున‌ కొత్త సినిమాను ప్రారంభించగలుగుతున్నానని చెప్పారు.

More Telugu News