Akhil: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • జూన్ 19న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' 
  • నెలలో చెరిసగం డేట్స్ ఇస్తున్న ప్రభాస్
  • మోహన్ బాబు బర్త్ డేకి 'మోసగాళ్లు'
Most Eligible Bachelor gets release date officially

*  అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇందులో అఖిల్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటించింది.    
*  ప్రభాస్ నటిస్తున్న 'సలార్', 'ఆదిపురుష్' రెండు చిత్రాలూ ప్రస్తుతం సెట్స్ మీద వున్నాయి. దీంతో ప్రతి నెలలోను 15 రోజులు సలార్ కు, మరో 15 రోజులు ఆదిపురుష్ షూటింగుకు ప్రభాస్ కేటాయించినట్టు సమాచారం.
*  విష్ణు మంచు హీరోగా జెఫ్రీ చిన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోసగాళ్లు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో విష్ణు సరసన రుషి శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని మార్చి 19న మోహన్ బాబు జన్మదినం నాడు రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News