Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ... ఖాళీగా క్యూ లైన్లు!

  • తగ్గిన సామాన్య భక్తులు
  • వీఐపీ బ్రేక్ దర్శనానికి భారీగా డిమాండ్
  • నిన్న రెండు కోట్లకు పైగా హుండీ ఆదాయం
Low Rush in Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. ఈ ఉదయం స్వామి దర్శనం కోసం దాదాపు 2 వేల మంది మాత్రమే నిరీక్షిస్తున్నారు. వీరికి ఉదయం 10 గంటల్లోపు దర్శనం పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీ వెంకటేశ్వరుడిని 39 వేల మందికి పైగా దర్శించుకున్నారని, 14 వేల మంది వరకూ తలనీలాలు సమర్పించారని తెలిపారు. హుండీ ద్వారా రూ. 2.30 కోట్ల ఆదాయం లభించిందని అన్నారు.

ఇక ఈ రోజు క్యూ లైన్లు ఖాళీగా ఉన్నాయని తెలుసుకున్న స్థానికులు స్వామి దర్శనానికి వెళుతున్నారు. మరోపక్క, ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం నిమిత్తం 8 వేలకు పైగా టికెట్లను అధికారులు జారీ చేసినట్టు తెలుస్తోంది. వీరి దర్శనానికి కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అంచనా.

More Telugu News