oli: మా దేశంలో అయోధ్య‌ రాముడి ఆల‌య ప‌నులు జ‌రుగుతాయి: నేపాల్ ప్ర‌ధాని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

  • తీరు మార్చుకోని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ
  • నేపాల్ లోని అయోధ్యపురిలో ఆల‌యాన్ని నిర్మిస్తామ‌ని వ్యాఖ్య‌
  • నిర్మాణం కోసం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నామ‌న్న ఓలీ
  • రాముడు, సీతాదేవి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయ‌ని వ్యాఖ్య‌
ram temple will construct in Nepal Ayodhya says oli

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీని అధికార నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఆప‌ద్ధ‌ర‌మ్మ ప్ర‌ధానిగా కొన‌సాగుతున్నారు. అయిన‌ప్ప‌టికీ, ఆయ‌న తీరులో మార్పు రాలేదు. గ‌తంలో అయోధ్య‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

త‌మ దేశంలోని బీర్‌గంజ్ సమీపంలో నిజమైన అయోధ్య ఉందని, నిజానికి శ్రీరాముడు పుట్టిన అసలైన అయోధ్య నేపాల్‌లో ఉందని ఆయ‌న అప్ప‌ట్లో చెప్పారు. అంతేగాక‌, శ్రీరాముడు భారతీయుడు కాదని నేపాల్ వ్య‌క్త‌ని అన్నారు. సంస్కృతి ప‌రంగానూ త‌మ‌ను అణ‌చివేయడానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. ఓలీ తాజాగా మ‌రోసారి అటువంటి వ్యాఖ్య‌లే చేశారు.

తాజాగా జ‌రిగిన‌ నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... రాముడు పుట్టింది నేపాల్ లోని అయోధ్యపురి అని, అక్క‌డ ఆలయ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమ‌వుతున్నాయ‌ని తెలిపారు.  ఆలయ నిర్మాణం కోసం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాముడు, సీతాదేవి విగ్రహాలు రూపుదిద్దుకున్నాయ‌ని తెలిపారు.

లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను కూడా చేయించనున్నట్లు  చెప్పారు.  వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి త‌మ దేశంలోని అయోధ్యపురిలో విగ్రహ ప్రతిష్ఠాపన జ‌రుగుతుంద‌ని చెప్పారు. దీంతో ఆ ప్రాంతం గొప్ప‌ పర్యాటక ప్రదేశంగా మారుతుందని తెలిపారు. అలాగే, ప్రపంచంలోని హిందువులతో పాటు పురావస్తు శాస్త్రవేత్తలు, సాంస్కృతిక నిపుణులకు ఆ ప్రాంతం గమ్యస్థానంగా మారుతుంద‌న్నారు.

More Telugu News