Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'ఆచార్య'కు బాగానే తీసుకుంటున్న పూజ 
  • రజనీకాంత్ తో సీనియర్ దర్శకుడి ప్రాజక్ట్
  • రానా 'విరాటపర్వం' రిలీజ్ డేట్ ఖరారు  
Pooja Hegde charges a bomb for Acharya

*  చిరంజీవి, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చరణ్ సరసన పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇందుకు గాను ఈ ముద్దుగుమ్మ కోటి రూపాయలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
*  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ కలయికలో మరో సినిమా రానుంది. ఈ విషయం గురించి దర్శకుడు రవికుమార్ చెబుతూ, రజనీగారికి ఆమధ్య ఓ కథ చెప్పాను. ఆయనకు నచ్చింది, శారీరకంగా ఫిట్ గా అయ్యాక తప్పకుండా చేస్తానని చెప్పారు. ఈ చిత్రానికి రాణా అనే టైటిల్ కూడా అనుకున్నాము' అని చెప్పారు. కాగా, రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే.
*  రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న 'విరాటపర్వం' చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటించింది.  

More Telugu News