varun dhavan: వరుణ్ ధావన్ పెళ్లి చేసుకోవ‌డంపై హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్లు

  • ఇటీవలే జ‌రిగిన‌ వ‌రుణ్ ధా‌వన్ పెళ్లి 
  • వివాహం అనే ఊబిలోకి దిగాడన్న శ్రద్ధా శ్రీనాథ్ 
  • సినిమాల్లో హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయ‌లేడేమో
  • ఆ హీరో భార్య, అత్త వారింటి వాళ్లు ఒప్పుకోరు
sraddha controversial comment on varun marriage

బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధా‌వన్ తన ప్రేయ‌సి న‌టాషా ద‌లాల్ ను ఈ నెల‌ 24న పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయ‌న వివాహంపై హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. కొత్త జంట‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఆమె చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. మరొక‌ మంచి నటుడు వివాహం అనే ఊబిలోకి దిగాడని ఆమె పేర్కొంది.

వ‌రుణ్ ధావ‌న్‌ను మనం ఇక ఆన్‌స్క్రీన్‌పై ఎక్కువ‌గా చూసే అవకాశం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలిపింది. ఎందుకంటే సినిమాల్లో హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తే, ఆ హీరో భార్య, అత్త వారింటి వాళ్లు అంగీక‌రించ‌క‌పోవ‌చ్చ‌ని చెప్పింది. ఇక‌పై ఆయ‌న‌ పురుష ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నటిస్తాడా? అంటూ ప్ర‌శ్నించింది.

పెళ్లి చేసుకోవ‌డంతో ఆయ‌న ఇక‌పై సినీ, వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడోనంటూ కామెంట్ చేసింది. ఆయ‌న ఇక‌పై కొంచెం కష్టప‌డొచ్చ‌ని, దీంతో ఆయ‌న‌ను మనం మిస్‌ కానున్నామ‌ని చెప్పింది. చివ‌ర‌కు వరుణ్‌కి శుభాకాంక్ష‌లు తెలిపింది. ఆమెపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

More Telugu News